calender_icon.png 22 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల పరిశ్రమ సందర్శన

22-09-2025 12:48:17 AM

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : వెంకటాపూర్ అనురాగ్ యూనివర్శిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఫైనల్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ విద్యార్థులు  మేడిపల్లి లోని లాండ్ మార్క్ ప్రీమియం కార్స్  కియా మోటర్స్ సర్వీస్ సెంటర్ ను సందర్శించారు. 

ఐ.ఈ.ఈ.ఈ  రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సొసైటీ అండ్ నానో టెక్నాలజీ కౌన్సిల్ స్టూడెంట్ చాప్టర్, అనురాగ్ యూనివర్శిటీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈపరిశ్రమ సందర్శనలో విద్యార్థులు కార్ల సర్వీసింగ్ మరియు రిపేరు పద్ధతులపై ప్రాయోగిక అవగాహన పొందారు.

కంపెనీ సర్వీస్ మేనేజర్ క్రాంతి, మేనేజర్ శ్రీనివాస్ రిపేర్, సర్వీసింగ్ లోని అన్ని అంశాలను వివరించారు. ఈ సందర్శనను అధ్యాపకులు డాక్టర్ జష్ కుమార్ సమన్వయం చేశారు. ఈ అవకాశం కల్పించిన డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్, అసోసియేట్ డీన్  మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి డాక్టర్ కె. శ్రీనివాస చలపతి, అనురాగ్ యూనివర్శిటీ మేనేజ్మెంట్, లాండ్ మార్క్ ప్రీమియం కార్స్  మేనేజ్మెంట్ కు విద్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు.