09-05-2025 12:09:46 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 8 (విజయ క్రాంతి): పేద ప్రజలు వైద్యం కోసం సీఎం సహాయనిధి పథకం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. గురు వారం తన నివాసం వద్ద బాధితులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ సర్పంచ్ మార్సుకోల సరస్వతి, తదితరులు ఉన్నారు.