calender_icon.png 25 September, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీఎంలో రెండు నెలల పసికందు మృతి

25-09-2025 01:03:34 AM

 వైద్యుల నిర్లక్ష్యమే కారణం?

వరంగల్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో రెండు నెలల పసికందు మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. ములుగు జిల్లా వాజేడుకు చెందిన దంపతులు తమ రెండు నెలల చిన్నారి అనారోగ్యానికి గురవడంతో ఎంజీఎం ఆసుపత్రికి మూడు రోజుల క్రితం తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న పసికందు బుధవారం మృతిచెందింది. అయితే విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఆక్సిజన్ అందలేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డ చనిపోయిందంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.