calender_icon.png 1 November, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ గౌరవం దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు

01-11-2025 12:56:41 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): భారత్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర మంతి బండి సంజయ్ తెలిపారు. ఈ మేర కు ఆయన శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశా రు. ‘పాకిస్తాన్ మనపై దాడి చేసింది.

కానీ భారత్ స్పందించ లేదు’ అని చెప్పి దేశ గౌరవాన్ని సీఎం దెబ్బతీశారని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు దేశ సైనికుల ధైర్యసహసాలకు అవమానం అని, ప్రజలకు, సైనికులకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.