calender_icon.png 1 November, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోరక్షకులపై దాడులను అరికట్టాలి

01-11-2025 12:54:53 AM

కాశీ విశ్వనాథ పీఠం గోశాల పీఠాధిపతి శ్రీశ్రీ దుర్గానంద పూరి

ఖైరతాబాద్: అక్టోబర్31(విజయ క్రాంతి) : రాష్ట్ర వ్యాప్తంగా గోరక్షకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠం గోశాల పీఠాధిపతి శ్రీశ్రీ దుర్గానంద పూరి అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవు ల అక్రరవాణాను అరికట్టడంతోపాటు వాటి రక్షణకు అనేక చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పు లు ఉన్నాయన్నారు.

కానీ ప్రభుత్వాలు, యంత్రాంగం చర్యలేమీ తీసుకోవడం లేదన్నారు. గోవులను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా గోరక్షకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. గోర క్షకులపై జరుగుతున్న దాడులను అరికట్టడంతోపాటు సోనుసింగ్ కేసులో నింది తుల ను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పవన్ కుమార్, రాముయా దవ్, హరీశ్‌యాదవ్, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.