calender_icon.png 24 January, 2026 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్య.. మెరుగైన వైద్యం ప్రభుత్వ లక్ష్యం

24-01-2026 12:47:55 AM

జపనీస్, జర్మనీ భాషలపై కోచింగ్

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ

సంగారెడ్డి, జనవరి 23(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్యం అందించడమే ప్ర భుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో గాడియం స్కూ లు క్యాంపస్ లో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన 2026 ముగింపు వేడుకలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన  పలు రకాల ఆవిష్కరణ లను పరిశీలించారు. వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్ధులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భం గా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో పిల్లలు రాణిం చాలంటే భాషా ప్రావీణ్యం, స్కిల్ డెవలప్మెంట్,  సృజనాత్మకతలను పెంపొందించు కోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రాథమిక విద్య నుండి ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వరకు వి ద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ తో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ను, మెరుగైన వైద్యాన్ని ప్రతి సామాన్యునికి రాష్ట్రంలో ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభు త్వం బాధ్యత తీసుకుందన్నారు.  జిల్లాస్థాయిలో 90 శాతం వైద్య పరమైన చికిత్సలను అందించేందుకు వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవల కోసం హైదరాబాదుకు వచ్చేలా ప్రజా వై ద్యాన్ని పటిష్టం చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా నర్సింగ్ వృత్తిని ప్రోత్సహించేందుకు నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. నర్సింగ్ విద్యార్థులు విదేశాలలో సేవలు అందించేందుకు వారికి విదేశీ విద్యలైన జపానీస్, జర్మనీ భాషలపై కోచింగ్ ఇస్తున్నామన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుత ఆవిష్కరణలు చేసిన విద్యార్థులకు నగదు బహుమతి, షీల్ లు, ప్రశంసా పత్రాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ అందజేశారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజి రెడ్డి, స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్, ఎస్‌ఈసీఆర్టీ డైరెక్టర్ రమేష్, అదనపు కలెక్టర్ పాండు, గాడి యం స్కూలు సీఈఓ రామకృష్ణ రెడ్డి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.