calender_icon.png 24 January, 2026 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపం పసివాడు

24-01-2026 12:50:07 AM

- పుట్టుకతోనే గుండెకు రంధ్రం

- ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

సిద్దిపేట క్రైం, జనవరి 23 : మగశిశువు పుట్టాడన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎంతోసేపు నిలవలేదు. పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉందని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నా రు. అప్పులు చేసి వైద్యం అందించిన తమ బిడ్డ ఆరోగ్యం మె రుగుపడలేదు. శస్త్రచికిత్స చేయించే స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మం డలం ధర్మారం గ్రామానికి చెందిన చెప్యాల దీపక్, రీతా దంపతులకు వారం క్రితం బాబు పుట్టాడు. పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో దాదాపు రూ.2 నుంచి 3లక్షల వరకు ఖర్చయ్యాయి.

అయినప్పటికీ బాబు ఆరోగ్యం మెరుగుపడలేదు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రోజుకు దాదాపు రూ.20వేల నుంచి 30వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఆపరేషన్కు రూ.5నుంచి 6లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఆ దంపతులు ఆపన్నహస్తం కోసం చూస్తున్నారు. అప్పులుజేసి రూ.3లక్షల వరకు ఖర్చుపెట్టి వైద్యం చేయించామని, తమ దగ్గర చిల్లిగవ్వ లేదని బాధిత దంపతులు బోరున విలపిస్తున్నారు. మనసున్న మారాజులు ఎవరైనా ముందుకొచ్చి 8008987020 నంబర్ కు యూపీఐ ద్వారా ఆర్థికసాయం అందించాలని వేడుకున్నారు.