calender_icon.png 1 November, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరు ఏరియాలో 73 శాతం బొగ్గు ఉత్పత్తి

31-10-2025 10:29:39 PM

జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ వెల్లడి

మణుగూరు,(విజయక్రాంతి): ఏరియాలో అక్టోబర్ నెలలో 73 శాతం బొగ్గు ఉత్పత్తి చేశామని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ తెలిపారు. శుక్రవారం జిఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ఉత్పత్తి, ఉత్పాదకత వివ రాలను వెల్లడించారు. అక్టోబర్ నెలలో 10 లక్షల 36 వేల 500 టన్నులకు బొగ్గు ఉత్పత్తి లక్ష్యం గాను 7 లక్షల 52 వేల 484 టన్నుల అంటే  73 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. అలాగే  ఏప్రిల్, అక్టోబర్  వరకు ప్రోగ్రెస్సివ్ బొగ్గు ఉత్పత్తి 62 లక్షల 11 వేల టన్నుల లక్ష్యానికి గాను 59 లక్షల 31 వేల 117 టన్నులతో 95 శాతం ఉత్పత్తి సాధించామన్నారు. ఏరియా నుండి 6 లక్షల 74 వేల 84 ట న్నుల బొగ్గును రవాణా చేసామని,  ప్రోగ్రె స్సివ్ గా 58 లక్షల 39 వేల 525 టన్నులు రవాణా జరిగిందన్నారు.అధిక వర్షాల వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని పేర్కొన్నారు.