01-11-2025 12:00:00 AM
జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి దివాకర్ గౌడ్
కుమ్రం భీం అసిఫాబాద్, అక్టోబర్ 31(విజయ క్రాంతి): కార్మిక హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీలకపాత్ర పోషించిందని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి దివాకర్ గౌడ్ అన్నారు. ఏఐటీ యూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా, సివిల్ సప్లై గోదాం, పొట్టి శ్రీరాములు చౌక్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
దివాకర్ గౌడ్ మాట్లాడుతూ 1920లో లాలా లజపతిరాయ్ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఏఐటీయూసీ, స్వాతంత్య్ర సమరంలోనూ, కార్మిక హక్కుల సాధనలోనూ అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహా య కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, సుధాకర్, భూమన్న, వెంకన్న, శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.