12-10-2025 02:04:35 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ‘కోల్డ్రిఫ్’ సిరప్(దగ్గుమందు)పై తాజాగా ఢిల్లీ ప్రభుత్వం నిషే ధం విధించింది. ఈ సిరప్ వాడి మధ్యప్రదేశ్‌లో పది మంది చిన్నారులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిం ది. తమిళనాడులోని ‘శ్రీసన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరర్’ కేంద్రంగా సిరప్‌లో వినియోగించిన డ్రగ్స్ మోతాదుకు మించి ఉన్నందునే చిన్నారుల మరణాలు సంభవించాయని,
అందుకే ఆ సిరప్‌ను తాము నిషేధిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఇదే కోవలో రాజస్థాన్‌లోనూ ఒకటి రెండు మరణా లు సంభవించాయి. దీంతో ఆ ప్రభుత్వం కూడా సిరప్‌పై నిషేధం విధించింది. సిరప్‌పై తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఉ త్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో నూ నిషేధం ఉంది.