calender_icon.png 12 October, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10కిలోల ఐఈడీ నిర్వీర్యం

12-10-2025 02:07:10 AM

ఛత్తీస్‌గఢ్ దామర్తిలో మావోయిస్టుల కుట్ర భగ్నం

చర్ల, అక్టోబర్ 11 (విజయక్రాంతి):  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దామర్తిలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు.  మావోయిస్టులు అమర్చిన 10 కిలోల ఐఈడీని డీఆర్‌జీ బృందం శనివారం నిర్వీర్యం చేశా రు. నగరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఫార్సి యా నుంచి చందన్ బహారా రోడ్డుపై మా వోయిస్టులో ఐఈడీని అమర్చారు.

సమాచారం అందుకున్న ఎస్పీ సూరజ్ సింగ్ పరిహార్, ఏఎస్‌పీ శైలేంద్ర పాండేల ఆధ్వర్యంలో డీఆర్‌జీ నగరి, బీడీఎస్ బృందంతో కూడిన సంయుక్త పోలీసు దళాన్ని మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు, శోధనలు, ప్రాంత ఆధిపత్యం కోసం పంపారు. దీంతో చందన్ బహారా రహదారిపై అనుమానాస్పద స్థితిలో 10 కిలోల కమాండ్- టిఫిన్ ఐఈడీని కనుగొని,  నిర్వీర్యం చేశారు. 

ఐఈడీ బాంబు పేలి జవాన్‌కు గాయాలు

 చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా, ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ నుంచి భద్రతా దళాల బృందం ఏరియా డామినేషన్ విధి నిర్వహణలో ఉండగా, మా వోయిస్టులు అమర్చిన ప్రెజర్ ఐఈడీ బాం బు శనివారం పేలింది.

ఈ పేలుడులో హెడ్ కానిస్టేబుల్ (జీడీ) దీపక్ డ్యూల్  గాయపడ్డాడు. ఈ సంఘటన తడపల్లాలోని ఫార్వా డ్ ఆపరేటింగ్ బేస్(ఎఫ్‌ఓబీ) కొత్త శిబిరం సమీపంలో జరిగింది. గాయపడిన సైనికుడిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. అతని పరిస్థితి సాధారణంగా ఉందని ఉన్నతాధికారి తెలియజేశారు.