calender_icon.png 10 September, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పకూలిన గురుకుల పాఠశాల భవనం

10-09-2025 12:00:00 AM

-తృటిలో తప్పిన పెను ప్రమాదం

-ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు

-సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఘటన

-ఘటన స్థలిని పరిశీలించిన మంత్రి దామోదర

మునిపల్లి, సెప్టెంబర్ 9: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాల పాత డార్మెంటరీ బ్లాక్ మంగ ళవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కొందరు విద్యార్థులు పాఠశాళ ఆవ రణలో, కొందరు తరగతి గదుల్లో ఉన్నారు. ఈ సమయంలోనే హాస్టల్ భవనానికి సం బంధించిన గోడలు కుప్పకూలిపోయాయి.

ఆ భవనానికి దగ్గర్లో ఉన్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శివానంద్, ఆరవ తరగతి విద్యార్థి ఎం అరవింద్, పదవ తరగతి విద్యార్థి ఎస్ జ్ఞానేశ్వర్లకు స్వల్ప గాయా లయ్యాయి. వారికి జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భవన గోడలన్నీ తడిసిపోవడంతోనే కుప్పకూలినట్లు అధికారులు చెపుతున్నారు.

ఈ పాఠశాలలో సుమారు 601 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కలెక్టర్ లింగంపల్లి  రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎస్ డి ఆర్ హెచ్ బృందం చేపట్టిన సహాయక చర్యలను కలెక్టర్ పర్యవేక్షించారు.

మంత్రి దామోదర సందర్శన

లింగంపల్లి గురుకుల పాఠశాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. ఘటనపై అధికారుల తో చర్చించారు. హాస్టల్‌లోని మిగిలిన భవనాల నాణ్యతను పరిశీలించి ఉపయోగానికి పనికిరాని వాటిని బ్లాక్ చేసి నివేదిక సమర్పించాలని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను ఆదేశించారు. గాయపడిన ముగ్గురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని హాస్టల్ అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. గురుకుల విద్యార్థుల తరగతులు యధావిధిగా కొనసాగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.