calender_icon.png 10 September, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మకు వెలుగొచ్చేనా?

10-09-2025 12:15:13 AM

- విధి దీపాలు లేక ప్రజల ఇక్కట్లు

- పండుగలు సైతం చీకట్లోనే..

- గట్లమల్యాల గ్రామాన్ని కుమ్మేసిన అంధకారం

నంగునూరు, సెప్టెంబర్ 09: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండగకైన తమ గ్రామంలో వెలుగు లు వస్తాయా అంటూ మహిళలు ఎదురుచూస్తున్నారు. సంవత్సర కాలంగా వీధి దీ పాలు లేక నంగునూరు మండలంలోనీ గట్లమల్యాల గ్రామం ప్రజలు అంధకారంలో బ్రతుకుతున్నారు. సిద్దిపేట జిల్లా గట్లమల్యాల గ్రామంలో వీధి దీపాలు వెలగక పోవ డంతో రాత్రి సమయాల్లో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు.

కనీసం ప్రధాన రహదారిలో కూడా వీధి దీపాలు వెలగకపోవ డం వల్ల రాత్రిపూట ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. కొన్ని సందర్భా ల్లో రోడ్డు ప్రమాదాలు జరగగా, అటు వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. దీనితో రా త్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే గ్రామస్థులు జంకుతున్నారు. రాత్రి సమయంలో కొన్ని ఇళ్లల్లో వస్తువులు మాయమవుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు పదే పదే గ్రామ పంచాయతీ కార్యదర్శిని వీధి దీపాలు ఏర్పాటు చేయమని కోరిన ఫలితం లేదు.

‘నిధులు లేవు, నిధులు వచ్చిన తర్వాత చూద్దాం‘ అంటూ కార్యదర్శి ఇచే సమాధానం ప్రజలకు ఆవేదనను మిగులుస్తుంది. కొందరు నాయకుల ఇంటి ముందు మాత్రమే వీధి దీపాలు వెలుగుతుండగా అందుకు నాయకులు కూడా మౌనం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ పండుగలో భాగంగా రాత్రివేళల్లో బతుకమ్మ గల్లీలో ఆడుతారు. ఈ పం డుగ సందర్భంలోనైనా ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే గ్రామంలో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

దీపాలు లేకుండా ఎలా బ్రతకమంటారు?

చిన్నపిల్లలు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. మా బతుకు కూడా అంధకా రంలోనే ఉండిపోయింది.వీధుల్లో ఎటు చూసినా కుక్కల గుంపులు,సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.అధికారలు ఈ సమస్యను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.వెంటనే ఈ సమస్యను పరిష్కరించి, మా గ్రామానికి వెలుగులు అందించాలని కోరుకుంటున్నాను.

ఎర్ర బాబు, గ్రామస్థుడు గట్లమల్యాల

నాకు ఇంకా గ్రామం గురించి తెలువదు

పది రోజుల క్రితమే నాకు గ్రామం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు ఇచ్చారు. ఇంకా గ్రామం గురించి పూర్తిగా తెలియదు, నిధులు లేని ఉండొచ్చు అందుకే వీధిలైట్లు ఏర్పాటు చేయలేకపోయారు త్వరలోనే గ్రామంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. 

దేశి రెడ్డి, మండల విద్యాధికారి, గ్రామ ప్రత్యేక అధికారి.