10-09-2025 01:16:27 AM
-గజ్వేల్‌లో చెప్పులతో కొట్టుకున్న మహిళా రైతులు
-పలు చోట్ల క్యూలో ఆధార్ కార్డులు, చెప్పులు
-తెల్లవారుజాము నుంచే విక్రయ కేంద్రాలకు
-అయినా దొరకని బస్తాలు
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో యూరియా కొరత రైతుల ను వేధిస్తున్నదే ఉన్నది. మంగళవారం పలుచోట్ల రైతులు బారులు తీరగా.. కొన్ని చోట్ల చెప్పులు, ఆధార్‌కార్డులు లైన్‌లో పెట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని మార్కెట్ కమిటీ ఆవరణలో మంగళవారం యూరియా టోకెన్ల కోసం వచ్చిన మహిళా రైతులు చెప్పులతో కొట్టుకున్నారు.
యూరియా టోకెన్ల కోసం వేకువజా ము నుంచే క్యూ కట్టడానికి రైతులు సిద్ధమయ్యారు. తెల్లవారుతున్న క్రమంలో అధికారులు టోకెన్లు ఇవ్వడానికి రావడంతో క్యూలో నిలబడుతున్న మహిళా రైతులు నేను ముందంటే నేను ముందు అం టూ గొడవకు దిగారు. గొడవ కాస్త ముదిరి ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. మర్కుక్ రైతు వేదిక వద్ద యూరియా టోకెన్ల కోసం రైతులు క్యూలో ఆధార్ కార్డులను ఉంచారు.
ఏవోపై చర్యలు తీసుకోండి
చేర్యాల ఏఓ బోగేశ్వర్ నాయకులకు చాటుగా టోకెన్లు ఇస్తూ తమను మోసం చేస్తున్నాడంటూ రైతులు చేర్యాల పట్టణంలో నేషనల్ హైవేపై ధర్నా చేశారు. గత కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నా కూడా తమకు టోకెన్లు ఇవ్వడం లేదని, ఇచ్చినా యూరి యా అయిపోయిందంటూ మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఏవో బోగేశ్వర్‌పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. చేర్యాల ఏడిఏ రాధిక రైతులతో మాట్లా డి, యూరియా బస్తాలు అందేవిధంగా చూ స్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు.
అన్నదాతల రాస్తారోకో
వికారాబాద్ జిల్లా యాలల మండలం లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తా వద్ద రైతులు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించడంతో కొడంగల్ రా ష్ట్రానికి వెళ్లే వాహనాలు దాదాపు రెండు గం టల పాటు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ మార్గంలో ఉన్న ఆగ్రో రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం వచ్చిన రైతులతో కిక్కిరిసిపోయింది.
ఘటన స్థలానికి కి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భద్రాద్రి జిల్లా మణుగూరు పట్టణంలోని సహకార సొసైటీ ద్వారా మం గళవారం వ్యవసాయాధికారులు టోకెన్ల ద్వారా యూరియా పంపిణీ చేశారు. దీంతో ఉదయం నుంచే రైతులు సొసైటీ కార్యాలయం వద్ద బారులు తీరారు. కొందరు లైన్‌లో నిల్చోలేక చెప్పులను వరుసలో పెట్టారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు.
దీంతో కరీంనగర్, హుస్నాబాద్ వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయా యి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సాయికృష్ణ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని ఆందోళన విరమించేందుకు ప్రయత్నించగా, అధికారులు స్పష్టమైన హామీ ఇస్తే నే ఆందోళన విరమిస్తామని రైతులు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి రెండు రోజుల్లోగా కూపన్లు ఉన్న రైతులందరికీ యూరియాను పంపిణీ చేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు.
మహిళలు సైతం క్యూ లైన్ లో చేరడంతో కిలోమీటర్ దూరం వరకు లైన్ చేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాక గ్రామంలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ వ్యవసాయ కార్యాలయం వద్ద డివిజన్ పరిధిలోని రైతులు ఆందోళన చేపట్టారు.
యూరియా కొరత ఉందని అధికా రులు సమాధానం ఇవ్వడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులు గంటకు పైగా రహదారిపై ఆందోళన చేపట్టారు. డీలర్లు, అధికారులు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్‌కు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. కాగా యూరియా కోసం వచ్చిన రైతులకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేశారు.