calender_icon.png 10 September, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిస్నీల్యాండ్ స్కూల్‌లో కాళోజీ జయంతి

10-09-2025 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్‌లోని డిస్నీల్యాండ్ హైస్కూల్‌లో కాళోజీ నారాయణరావు 111వ జయంతి సందర్భంగా తెలంగాణ మాండలళిక భాషా దినోత్సవాన్ని మంగళవారం  ఘనంగా జరుపుకున్నారు.

పాఠశాల ముఖ్య సలహాదారులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, కరస్పాండెంట్ బాలుగు శోభారాణి, డైరెక్టర్లు దయ్యాల రాకేష్ భాను, దినేష్ చందర్ కాళోజి చిత్రపటానికి పూలమాల సమర్పించి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. తెలంగాణ మాండలిక భాష ఎంతో ప్రాశస్త్యమైనదని, నిజాం రాజు పరిపాలన పుణ్యమా అని మన తెలంగాణ భాష ఎంతో నిరాదరణకు గురి అయిందన్నారు.

మన యాస, మన భాషలోనే తెలంగాణ ప్రజల జీవితం ఉందని, మనం పడ్డ గోసను కాళోజీ తన గోసగా ‘నా గొడవ‘ అనే పుస్తకంలో రాశాడని చెప్పారు. విద్యార్థులు మాతృభాషను కన్న తల్లిని ఎప్పటికీ మరువకూడదని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, తిరుమలేష్, సారంగపాణి, భవాని, స్రవంతి  పాల్గొన్నారు.