calender_icon.png 17 October, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి పంటకు మద్దతు ధర పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

17-10-2025 06:25:38 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): వరి పంట మద్దతు ధర రైతులకు తెలియాలని ఉద్దేశంతో మద్దతు ధర పోస్టర్లను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం లో పౌరసరఫరాల సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన వరి పంటకు మద్దతు ధర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ  పోస్టర్లు జిల్లాలోని ప్రతీ పి.పి.సి. సెంటర్లకు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, డి.సి.ఎస్.ఓ  వెంకటేశ్వర్లు, డి.ఆర్.డి.ఏ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.