17-10-2025 06:27:55 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు రక్షించుకోవడమే ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు బీసీ సంఘ నాయకులు దండు వినోద్ శుక్రవారం కోర్టుకు వచ్చి మద్దతు కోరడంతో వేములవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోర్టు విధులను శనివారం బహిష్కరించి మద్దతు తెలుపుతున్నట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు.