24-10-2025 12:00:00 AM
చేగుంట, అక్టోబర్ 23 : చేగుంట మండల కేంద్రంలోని వడియారం పాస్నేట్ గ్రౌండ్ హై స్కూల్ పాఠశాల ఆవరణలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోమ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతం అయ్యింది. ఇందులో భాగంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందజేశారు.
ఇందులో భాగంగా కంటి, డెంటల్ థెరపీ, మసాజ్ థెరపి, ఆక్యుపంక్చర్, నేచురోపతి చికిత్సలను గ్రామస్థులకు చేసి మందులు ఉచితంగా అందజేశారు. అదేవిధంగా రోగులకు సలహాలు, సూచనలు అందజేశారు. గ్రామంలో 50 శాతం రోగులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయరాజు, డాక్టర్ అభిషేక్, డాక్టర్ భరత్, డాక్టర్ నందిని, డాక్టర్ మనోజ్, సంపత్, స్వామి, కుసుమ, గ్రామస్తులు సాయికుమార్ గౌడ్, నవీన్ పాల్గొన్నారు.