29-08-2025 01:48:43 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రేగొండ/భూపాలపల్లి ఆగస్టు 28 ( విజయ క్రాంతి): బీసీ రిజర్వేషన్లను భాజపా,బిఆర్‌ఎస్ పార్టీలే అడ్డుకుంటున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విమర్శించారు. భూపాలపల్లి ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, రేగొండ మండలం లోని లింగాల మహాత్మ జ్యోతిబా పూలే గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రేగొండ, కొత్తపల్లి గోరి మండలాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పేట వేస్తుందని, విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ముందుగా వంట గదిలో విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో భోజనం చేశారు. పలువురు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలుపగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం గోరి కొత్తపల్లి, రేగొండ మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసి పేద ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.