calender_icon.png 28 November, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

28-11-2025 12:00:00 AM

కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో నామినేషన్లు 

కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం  సోమవార్ పేట్ గ్రామ పంచాయితి కార్యాలయంలో  గురువారం నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.గ్రామ పంచాయతి ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ కామారెడ్డి  జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు  నోటిఫికేషన్ లు జారీ చేసి,

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాలైన కామారెడ్డి, బిక్నూర్, బీబీ పేట్, దోమకొండ, మాచారెడ్డీ, పాల్వంచ, రాజం పేట్, రామారెడ్డి, సదాశివ నగర్, తాడ్వాయి మండలం పరిధిలోని  సర్పంచ్ 167,  వార్డు 1520 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ , పోలింగ్ కేంద్రాలు 1533 లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు, నోటీసు బోర్డుల పై నోటిఫికేషన్ పత్రాల ప్రదర్శనను పరిశీలించారు.

ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా , పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డుల పై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. 

ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, పత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ సరళ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.