28-11-2025 12:00:00 AM
కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి):టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా నీటిపారుదల శాఖ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటిపారుదల శాఖ కామారెడ్డి లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు టీఎన్జీవోస్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. 80 సంవత్సరాల చరిత్ర కలిగి ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఎన్జీఓస్ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము అని వారు తెలిపారు.
భవిష్యత్తులో కూడా పెన్షనర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగుల. పెండింగ్ బిల్లులు, పి.ఆర్.సి, 5. డిఎలు, ఆరోగ్యకార్డులు, వివిధ సమస్యలపై పోరాడి సమస్యల పరిష్కారానికి టిఎన్జీవోస్ యూనియన్ మాత్రమే కృషి చేస్తోందని ఉద్యోగులు నమ్మకంతో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు.
జిల్లా సహాధ్యక్షులు ఎమ్ చక్రధర్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ ఖదీర్, జిల్లా EC మెంబర్ సాయినాథ్, అర్బన్ తాలూకా అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి, అర్బన్ ఉపాధ్యక్షులు భక్తవత్సలం జిల్లా నీటిపారుదల శాఖ కామారెడ్డి ఉద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.