calender_icon.png 10 October, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండండి

10-10-2025 01:10:58 AM

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, అక్టోబర్ 9(విజయక్రాంతి): స్థానిక సంస్థ ల ఎన్నికలు ఎప్పుడు జరిగిన అందరూ సిద్ధంగా ఉండలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులకు సూచించారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హన్వాడ మండల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలనీ కోరారు.

గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉందని, ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులకు విజయ అవకాశలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. ప్రజలకి బాకీ కార్డును ఇచ్చి ప్రభుత్వం చేసిన మోసం వివరించాలని చెప్పారు. పదేండ్ల కాలంలో గ్రామం.. మండలంలో చేసిన అభివృద్ధి.. ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సమావేశం లో మాజీ ఎంపీపీ బాలరాజు, మాజీ జడ్పీటీసీ నరేందర్, పార్టీ మండలం అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, సీనియర్ నాయకులు చెన్నయ్య,లక్ష్మయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.