22-07-2025 12:40:56 AM
మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు
మహబూబాబాద్, జూలై 21 (విజయ క్రాంతి): ప్రజల రక్షణ కోసమే పోలీసు వ్యవస్థ ఉందని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కార్బన్ సర్చ్ నిర్వహించడం జరిగిందని, ప్రజలు అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతి రావు అన్నారు. జిల్లాలోని కురవి మండలం లింగ్యా తండాలో సోమవారం ఉదయం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిలువ చేసిన రెండు క్వింటాళ్ల నల్ల బెల్లం, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
అలాగే సరైన ధ్రువపత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటో లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దని, నేరాల అదుపు కోసం గ్రామంలో కలిసికట్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వచ్చే స్థానిక ఎన్నికల్లో ఏలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని డిఎస్పి కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ సర్వయ్య, ఎస్త్స్రలు సతీష్, మురళీధర్ రాజ్, దీపిక, నరేష్, రవికిరణ్, పోలీసు సిబ్బంది 40 మంది పాల్గొన్నారు.