calender_icon.png 15 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్

18-05-2025 11:45:38 PM

అనాథ యువతికి వివాహం జరిపించనున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): బాజాభజంత్రీలు, మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్చారణలు, తరలివచ్చే అతిథుల సమక్షంలో ఓ అనాథ యువతి వివాహం జరిపించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని, తల్లిదండ్రులను కోల్పోయి రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రంలో మానస, తన చెల్లితో కలిసి 16 ఏళ్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా రఘనాథపల్లికి చెందిన రాజేశ్ తో ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైందని, ఆ యువతికి పెళ్లి పెద్దగా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్రావు, అదనపు కలెక్టర్లు, బాలల పరిరక్షణ అధికారులు, స్వచ సంస్థల ప్రతినిధులు ఈనెల 21న యువతి వివాహం కలెక్టరేట్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో  చేయనున్నారు.