calender_icon.png 26 September, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం షాపుల రిజర్వేషన్లు ఖరారు

26-09-2025 07:51:22 PM

వలిగొండ,(విజయక్రాంతి): ప్రభుత్వం మద్యం షాపులకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా  మద్యం షాపులకు రిజర్వేషన్ల ఖరారుని కూడా పూర్తి చేసింది. అందులో భాగంగా వలిగొండ మండలంలోని ఐదు మద్యం షాపులకు రిజర్వేషన్లు విడుదలయ్యాయి. వలిగొండ-1 మద్యం షాపు ఎస్సీ రిజర్వేషన్, వలిగొండ-2 మద్యం షాపు గౌడ్ రిజర్వేషన్, వలిగొండ మూడు మరియు నాలుగు షాపులకు జనరల్ రిజర్వేషన్, ఆరూర్ లోని ఐదవ షాపుకు కూడా జనరల్ రిజర్వేషన్ ఖరార్ అయింది. నేటి నుండి మద్యం టెండర్లు దరఖాస్తులు ప్రారంభమై వచ్చేనెల 18న ముగియనున్నాయి. వచ్చేనెల 23న డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించనున్నారు.