26-09-2025 08:07:23 PM
నకిరేకల్,(విజయక్రాంతి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి భూస్వాములపై ఎగిసిపడిన ధిక్కారస్వరం చాకలి ఐలమ్మని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని ఇందిర గాంధీ సెంటర్లో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారిచిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక, తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మని ఆయన పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తి,పోరాటం భావితరాలకు ఆదర్శంగా ఉన్నారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ముందుకెళ్లాలని ఆయన కోరారు.