calender_icon.png 26 September, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిపి కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి

26-09-2025 06:41:33 PM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికులను పండగపూట పస్తులతో ఉంచొద్దని 3 నెలల వేతన బకాయిలను వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని లేకపోతే సమ్మెలోకి వెళ్తామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల వేతన బకాయిలు విడుదల చేయాలని యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పండుగలు వస్తున్నాయని ఇప్పటికే మూడు నెలల వితనాలు పెండింగ్ లో ఉన్నాయని మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్మికుల వేతనాలు పెంచుతామని,మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాం అని చెప్పిన నాయకులు హామీలు విస్మరించి పోరాడితే పెండింగ్ వేతనాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా దీపావళి పండుగలు వస్తున్నాయని ఇప్పటికే కార్మికులు కుటుంబాలు గడవడం కోసం అప్పులు చేశారని ఈ పరిస్థితుల్లో వేతనాలు ఇవ్వకపోతే పస్తులతో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. సెలవుల పేరుతో కోత పెట్టకుండా వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ను కాకుండా జిపిలోని జనరల్ ఫండ్ నుండి కార్మికులకు వేతనాలు ఇస్తూ వేతనాల కోసం వచ్చిన బడ్జెట్ ను ఇతర అవసరాలకు గతంలో వాడారని ఇప్పుడు అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

జనరల్ ఫండ్ నుండి కార్యదర్శులు ఖర్చు పెట్టుకోవాలంటే ఎస్ టి వో లో ఫ్రీజింగ్ అవుతుందని కార్మికుల వేతనాలు అంటే త్వరగా వస్తాయని ఈ రకమైన తంతు నడుపుతున్నారని అన్నారు.కార్మికులు మూడు నెలలుగా అప్పులు అప్పులు చేసి ఆర్థిక సమస్యలతో కుటుంబాలు గడవక అర్ధాలతో అలమటిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గుడ్డి గుర్రం పండ్లు తోముతుందా అని ప్రశ్నించారు.ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్స్ తో పాటు ఇతర పార్ట్ టైం వర్కర్స్ కూడా వేతనాలు  ఇవ్వాలని అన్నారు. లేకపోతే పనులు బంద్ పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.