26-09-2025 08:02:05 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఏడవ నిజాం నవాబు పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్న దొరల దౌర్జన్యాన్ని, బహుజనులు ఎదుర్కొన్న వివక్షను, మహిళలు ఎదుర్కొన్న అన్యాయాలను ప్రతిఘటించిన చైతన్యజ్యోతి చాకలి ఐలమ్మ అన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ... ఆమె పోరాటం కేవలం భూమి కోసం జరిపింది కాదు. ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం జరిగిన మహా సంగ్రామం. బానిసత్వానికి తలొగ్గకుండా తాము సాగుచేసిన భూమిపై హక్కు సాధించాలనే సంకల్పంతో నాడు పేదలు, రైతులు, కూలీలు సంఘటితమయ్యారు.
ఈ పోరాటంలో ఐలమ్మ ముందు నడిచి, విజయం సాధించింది. అటువంటి ఐలమ్మ జయంతిని జరుపుకోవడం తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని తిరిగి ప్రజల్లో నాటడమే. ఆ స్ఫూర్తి నేడు కూడా సామాజిక న్యాయం కోసం, భూ హక్కుల కోసం, సమాన హక్కుల కోసం పోరాడే వారికి ప్రేరణనిస్తుంది. రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను గుర్తించడం ద్వారా మహిళా నాయకత్వాన్ని, అణగారిన వర్గాల పోరాట గాథలను గౌరవించడం అవుతుంది. అందువల్ల ఐలమ్మ జయంతి తెలంగాణ ప్రజలకు సామాజిక సమానత్వం, రైతాంగ హక్కులు, స్త్రీ శక్తి అనే త్రివేణి సంగమంను గుర్తుచేసే ప్రేరణాత్మక దినోత్సవం.