calender_icon.png 26 September, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దాం...

26-09-2025 07:55:42 PM

జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసి పని చేద్దాం అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ను శుక్రవారం ఆయన స్వగృహంకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి అభినందించారు. ఈ మేరకు గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ...రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు  కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాలన్నారు.