calender_icon.png 2 September, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశుని సేవలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

02-09-2025 04:20:19 PM

భూపాలపల్లి,(విజయక్రాంతి): వినాయక చవితి వేడుకల్లో భాగంగా మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో చవితి వేడుకలు ఘనంగా జరుగగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని మట్టి వినాయకున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అందరికీ బొజ్జ గణపయ్య ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ... పర్యావరణ రహిత గణేశులనే ప్రతిష్టించుకోవాలని, జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి సుఖ, సౌభాగ్యాలతో విరాజిల్లాలని అభివృద్ధిలో జిల్లా రోల్ మోడల్ గా నిలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.