02-09-2025 04:23:32 PM
ఈవో ఎల్. రమాదేవి పలు విభాగాల పరిశీలన
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రాజన్న ఆలయం, వేములవాడ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈవో ఎల్. రమాదేవి. ఆలయంలోని పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా సెంట్రల్ గోదాం, లడ్డు ప్రసాద కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్‌తో పాటు కళ్యాణ కట్ట, నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి నిత్య కళ్యాణం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం నిర్వహించే ప్రదేశాలను. ఆలయ పరిసరాలు పరిశుభ్రతలను జాగ్రత్తగా సమీక్షించారు.
గోదాంలోని రికార్డులు, వస్తువులను సమగ్రంగా పరిశీలించిన ఈవో రమాదేవి. ఆలయ పరిపాలనా సరళత మరియు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను సిబ్బందికి అందించారు.ఈవో రమాదేవి మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని తెలిపారు.