02-09-2025 04:17:12 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి, వరి పంటలను మంగళవారం వ్యవసాయ అధికారులు సర్వే చేశారు. చాకెపల్లి, చంద్రవెల్లి గ్రామాలలో నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ సందర్శించారు.
పాత బెల్లంపల్లి, ఆకెనపల్లి గ్రామాల్లో నీట మునిగిన పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్ సర్వే చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. నష్టపోయిన రైతులు సర్వే చేయించుకున్నట్లయితే సంబంధిత ఏ ఈ ఓ ను గాని తనని గాని సంప్రదించాలని ఆయన సూచించారు.