05-07-2025 12:00:00 AM
వనపర్తి, జూలై 4 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా కేంద్ర శివారు లో గల మాత శిశు సంరక్షణ కేంద్రానికి వచ్చే గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన దగ్గరుండి వైద్య సేవలను అటు వైద్యులు ఇటు సిబ్బంది అందిస్తుండడంతో ఆసుపత్రి కి వచ్చే గర్భిణీ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ నే ఉంది.
గర్భిణీ స్త్రీలను తీసుకుని వచ్చిన తరువాత సహజ కాన్పు లేదా సీజరియన్ అయితే దాదాపుగా 5 నుండి వారం రోజు లు ఉండాల్సి వస్తుంది. వైద్య సేవల వరకు బాగానే ఉన్న వారి వెంట వచ్చిన సహాయకులకు మాత్రం తిప్పలు తప్పడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
చిమ్మ చీకటిలోనే రాత్రంతా ....
ఆసుపత్రి ప్రాంగణం లో రెండు వైపులా గర్భిణీ స్త్రీల సహాయకులు రాత్రి వెళ్లలో ఉం డేందుకు వారి సామాన్లు పెట్టుకునేందుకు కోసం షెడ్ లను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి కి కుడి వైపు ఉన్న షెడ్ లో ఇటీవల ఆసుపత్రి కి వచ్చే గర్భిణీ స్త్రీల ఓపి సేవల టోకెన్ ఇచ్చేందుకు గదిని ఏర్పాటు తో పాటు వి ద్యుత్ సౌకర్యం ను ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణం లో ఎడమ వైపు ఏర్పాటు చేసిన షెడ్ లో విద్యుత్ సౌకర్యం కల్పించడం విస్మరించారు.
విద్యుత్ సౌకర్యం ఉన్న చోట ఉం డేందుకు గర్భిణీ స్త్రీల సహాయకులు వెళ్ళితే ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు లు ఇక్కడ ఉండవద్దు ఆ షెడ్ లో ఉండాలంటూ చెబుతు న్నారని ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేని చి మ్మ చీకటి లో తల దాచుకుంటూ కాలం వె ళ్ళదీస్తున్నమాంటూ గర్భిణీ స్త్రీల కాన్పు కో సం వచ్చిన సహాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం ఆసుపత్రి చుట్టూ నిర్మానుష ప్రాంతం కావడం తో పాములు, తేల్లు ల బెడద మరొక వైపు దొంగల బెడద సైతం ఉందని గర్భిణీ స్త్రీల కాన్పు కోసం వచ్చినసహాయకులు ఆరోపిస్తున్నారు.
వెలుతురు కోసం ఆసుపత్రి ముందే భోజనం
గర్భిణీ స్త్రీల కాన్పు కోసం వచ్చిన సహాయకులు ఉండే షెడ్ లో విద్యుత్ సౌకర్యం లేకపోవడం తో ఆసుపత్రి కి ప్రధాన ద్వారం ముందు గల స్టలంలో విద్యుత్ సౌకర్యం దగ్గ ర రాత్రి వెళ్లలో భోజనం చేస్తున్నారు. వర్షం వస్తే తమ పరిస్థితి చెప్పుకోలేని స్థితి లో ఉం టుందని సహాయకులు తమ భాదను వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఇంత మంచి వైద్య సే వలను అందిస్తున్న ఆసుపత్రి ప్రాంగణం లోని షెడ్‌లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని సహాయకులు కోరుతున్నారు.