calender_icon.png 5 July, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌ను అభివృద్ధిలో నెంబర్ 1గా మారుస్తా

05-07-2025 03:35:21 PM

రూ.20,000 కోట్లకుపైగా అభివృద్ధి పనులు – కేంద్ర మంత్రి బండి సంజయ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి

పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యం

హుజురాబాద్,(విజయక్రాంతి): గత ఆరు సంవత్సరాల్లో కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ.20 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌ను అభివృద్ధిలో దేశంలో నెంబర్‌వన్ పార్లమెంట్‌గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను శనివారం ప్రారంభించారు. వీణవంకలో రూ.78 లక్షలతో నిర్మించిన 18 అంతర్గత రోడ్లు, గండ్రపల్లిలో మరో రూ.78 లక్షలతో నిర్మించిన 13 రోడ్లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ...రోడ్లు బాగుంటేనే ప్రాంతం ఎదుగుతుంది మోదీ ప్రభుత్వం రవాణా వసతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది, ఎంపీగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా రోడ్ల నిర్మాణానికి విశేష నిధులు తీసుకోవచ్చానని ఆయన తెలిపారు.CRIF ఫండ్స్ కింద రూ.291 కోట్లతో 1341 కి.మీ. రోడ్లు,నరేగా నిధులతో ఇప్పటివరకు రూ.650 కోట్ల అభివృద్ధి పనులు,జాతీయ రహదారుల విస్తరణకు రూ.5 వేల కోట్లకుపైగా నిధులు తీసుకోవచ్చానని అన్నారు. అభివృద్ధికి రాజకీయాలకు అవకాశమే లేదు ఎన్నికల వరకే రాజకీయాలు.

అభివృద్ధికి మాత్రం ఎల్లప్పుడూ మా నిబద్ధత ఉంటుంది. పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నాఅని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతోనూ సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కరీంనగర్-వరంగల్, సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారుల అభివృద్ధి కొనసాగుతోందని, త్వరలో కరీంనగర్-జగిత్యాల రహదారి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.ప్రజలే దేవుళ్లు... వాళ్ల అభ్యున్నతే నా లక్ష్యం. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధిని వేగవంతం చేస్తానని తెలిపారు.