05-07-2025 12:00:00 AM
వొడితల ప్రణవ్
హుజురాబాద్,జూలై4: (విజయ క్రాంతి) సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆలస్యం చేయడం నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ప్రణయ్ బాబు విమర్శించారు. కరీంనగర్ జిల్లా హు జరాబాద్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పా ర్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ.ఎమ్మెల్యేకు ప్రభుత్వం పై కోపం ఉంటే ప్రజలపై చూపించడం తగదని, నెలలుగా చెక్కులు రివాలిడేషన్ పేరు తో తిరిగి పంపించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ హయాంలో విడుదలైన చెక్కులను సీఎం ఫొటో తీసేసి పంపిణీ చేయడాన్ని రాజకీయం చేస్తున్నార ని మండిపడ్డారు.చెక్కులు పంచడానికి కూ డా సమయం లేకపోవడం ఏంటని ప్రశ్నించారు, ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి ప్ర జా సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. సో షల్ మీడియాలో ప్రచారం చేయడానికే కా దు, ప్రజల సంక్షేమాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనిఅన్నారు.