27-01-2026 12:56:33 AM
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గణతంత్ర వేడుకలు
ఖమ్మం, జనవరి -26: 77వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమ వారం ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్ర మంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.