26-07-2025 12:56:48 AM
ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి,జూలై 25 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండ లంలోని వన్ పల్లి గ్రామంలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎరువులు విత్తనాల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు.ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘాల సభ్యు లు ఏర్పాటు చేసుకున్న స్వయం ఉపాధి యూనిట్లతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
అనంతరం గ్రా మంలోని ప్రైమరీ స్కూల్, అంగన్వాడి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాల ఆధారంగా పాఠ్యాంశాలు బోధించాలని,పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సం బంధిత అధికారులకు ఆదేశించారు.ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా ఉన్న దివ్యాంగురాలు అయిన మహిళ తన ఇంటికి వెళ్లేందుకు నాలా అడ్డుగా ఉందని, తనకు మంచినీటి కనెక్షన్ ఇవ్వలేదని, తనకు పురాతన పెంకుటిల్లు ఉన్నదని,ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ కు విన్నవించుకోగా.
దివ్యాంగురాలు సమస్యలపై తక్షణం స్పందించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.వీర్నపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలపై ప్రజలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆన్ అకాడమీ పేరుతో జేఈఈ నిట్ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు.
విద్యార్థులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో రాణించాలని వి ద్యార్థులకు సూచించారు.అనంతరం గ్రామంలోని తురకాశి పల్లెలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించి అవసరమైన ఇసుక,మట్టి కోసం సంబంధిత పంచాయతీ కార్యద ర్శులు ఆయా మండలాల తహసిల్దార్ల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.
ఎంపీడీవోలు ని త్యం పర్యవేక్షణ చేయాలని,లబ్ధిదారులు నిర్మిత గడువులోగా నిర్మించుకొని ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ శేషా ద్రి,జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం,మార్కెట్ కమిటీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.