calender_icon.png 31 October, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

31-10-2025 12:00:00 AM

సూర్యాపేట, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రం 1 వ వార్డు కుడ కుడ లో శ్రీ గౌతమి ఫార్మర్ మార్కెటింగ్ మ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ కు తీసుకువచ్చేటప్పుడు ఆరబెట్టుకొని, తేమ శాతం లేకుండా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఐకెపి సెంటర్లలో ధాన్యం వర్షాలకు తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ,సూర్యాపేట మండల అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ వేములకొండ పద్మ, తన్వీర్ హుస్సేన్,విజయ్, సాయి నేత, ఏవో ధరావతు వెంకటేశ్వర్లు, ఏఈఓ శైలజ, రైతులు వేములకొండ లక్ష్మయ్య, సైదులు, వల్లాల రాజు, పిండిగా వెంకయ్య, వేములకొండ గణేష్, తదితరులు పాల్గొన్నారు.