15-09-2025 01:23:49 AM
రాష్ట్ర కార్మిక సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి రామన్న
ముషీరాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న పోడు భూములు భూమిలేని నిరుపేదలకు ఒక్కొక్కరికి మూడెకరాలు ఇచ్చి వాటి వ్యవసాయ నీటి వసతులు కల్పించాలని తెలంగాణ కార్మిక సమాఖ్య(టీకేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి రామన్న, ప్రధాన కార్యదర్శి బందెల యాదగిరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం హైదరగూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అసైన్డ్, ఇనామ్, పంచరాయి, లావ ణ్య భూములకు ఏసోల్ పట్టా భూములకు పూర్తి యాజమాన్యపు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సమాఖ్య రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు దుర్గ భవాని, సుజా త, బద్రి మల్లేష్, నర్సింగరావు, ఏసు పాదం, అల్వాల వెంకన్న, రజిత, లక్ష్మీ, చిన్ను సోమయ్య తదితరులు పాల్గొన్నారు.