20-10-2025 12:21:01 AM
కేటీఆర్‌ను ఆహ్వానించిన ముషీరాబాద్ బీఆర్‌ఎస్ నేతలు
ముషీరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : ముషీరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సదరు ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న నిర్వహించే సదరు వేడుకలకు మాజీ మంత్రి కేటీఆర్ ను హాజరు కావాలని ఆహ్వాన కార్డును అంద జేశారు. ఆదివారం కేటీఆర్‌ను కలిసి సదరు వేడుకల వివరాలను, హరియానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి భారీ దున్నలను సదరు ఉత్సవాలకు తీసుకువచ్చామని ఎడ్ల హరిబాబు యాదవ్ కేటీఆర్ కు వివరించారు.
వైభవంగా నిర్వహించే సదరు వేడుకలకు రావాలని కోరారు. ఈ సందర్భంగా సదరు ఉత్సవ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వరుణ్ యాదవ్, అభినందన్ యాదవ్, సాయి యాదవ్, వీరేష్, వేణు యాదవ్, శంకర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.