25-10-2025 01:20:55 AM
జస్టిస్ ఎన్‌వీ రమణకు ఆహ్వాన పత్రికను అందజేసిన డాక్టర్ గజల్ శ్రీనివాస్
హైదరాబాద్, అక్టోబర్ 28(విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్ర దేశ్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3 నుంచి 5వ తేదీవరకు గుంటూరులోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం(హైవే)లో నందమూరి తారకరామారావు వేదికపై నిర్వహించే 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు రావాల్సిందిగా భారత సుప్రీకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణను డాక్టర్ గజల్ శ్రీనివాస్, శ్రీమా శర్మలు ఆహ్వానించారు. జనవరి 4న ఉదయం నిర్వహించే ‘తెలుగు వైభవ సభకు’ ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా వారు ఎన్‌వీ రమణను కోరారు. ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారని, తెలుగు భాషా వికాసం కోసం ప్రజలందరూ ఉద్య మం చేయాల్సిన అవసరం ఉందని రమణ అభిప్రాయం పడ్డారని డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.