14-10-2025 05:58:22 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో సుల్తానాబాద్ మండలంలోని గట్టెపల్లి మానేరు వాగులో ఉన్న మంచినీటి బావిలో మోటర్లు కాలిపోవడంతో సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్ పరిశీలించారు. పైనుండి వరద ఉదృతి అధికం కావడంతో బావి చుట్టూ ఉన్న ఇసుక కొట్టుకుపోయి మోటార్లు కాలిపోవడంతో వరద తగ్గిన అనంతరం మంగళవారం గట్టెపల్లి మంచినీటి బావిలో గల మోటర్లను బాగుపరిచారు.
గత వారం రోజులుగా మున్సిపల్ ప్రాంతంలోని ప్రజలకు త్రాగునీరుకు కొంత ఇబ్బందులు ఎదుర్కోవడంతో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అంతరాయం లేకుండా సరఫరా చేసి బావిలో ఉన్న మోటార్లను ఆధునికరించిన అనంతరం యధావిధిగా మంచినీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇట్టి మంచినీటి సరఫరా మరమ్మతులో స్థానిక మున్సిపల్ ఏ.ఈ. రాజ్ కుమార్, మంచినీటి సరఫరా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.