calender_icon.png 14 October, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మార్ట్ సిటీ పెండింగ్ పనులను డిసెంబర్ లోగా పూర్తి చేయాలి

14-10-2025 06:01:45 PM

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్..

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ పెండింగ్ ప్రాజెక్టుల అభివృద్ధి పనులను డిసెంబర్ 31 లోగా పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ప్రారంభించి ప్రస్తుతం పనులు కొనసాగుతున్న డిజిటల్ లైబ్రరీ భవనం, బాలసధన్ భవనం, ఐసీసీసీ భవనం అభివృద్ధి పనులతో పాటు ఎస్ వి పి భవనం అధునీకరణ అభివృద్ధి పనులను వేగవంతం పూర్తి చేయాలని అన్నారు. అక్టోబర్ మాసంలో ఎస్ విపి భవనం అధునీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. అంతే కాకుండా టవర్ సర్కిల్ రెనవేషన్ అభివృద్ధి పనులను కూడ ప్రారంభం చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలని అన్నారు.

అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి క్లోజర్ సర్టిఫికేట్ ప్రీపేర్ చేయాలని ఆదేశించారు. మంచినీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా... నీటి శుద్దీకరణ కేంద్రంలో చేపట్టిన మేజర్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విలీన గ్రామాల డివిజన్ తో సహా నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్లా పన్నుల వసూళ్ళపై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లైటింగ్ వ్యవస్థలో ఎక్కడ సమస్యలు రాకుండా నగర వ్యాప్తంగా వీది దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈలు సంజీవ్ కుమార్, యాదగిరి, డీఈలు లచ్చిరెడ్డి, ఓం ప్రకాష్, అయూబ్ ఖాన్, దేవేంధర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఏఈలు పాల్గొన్నారు.