calender_icon.png 14 October, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలి

14-10-2025 05:54:57 PM

ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలి..

పెద్ద కొడప్గల్ ఎస్సై అరుణ్ కుమార్..

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్ఐ అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం పెద్ద కొడప్గల్ లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు ఎల్లప్పుడూ తమ వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకోకుండా, సౌండ్ బాక్సులు పెట్టకుండా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని, పెద్ద కొడప్గల్ ఎస్సై అరుణ్ కుమార్ ఆటోడ్రైవర్ లకు సూచించారు. పెద్ద కొడప్గల్ ఎస్ఐ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలను పాటించడం, రహదారి భద్రత, ప్రజల రక్షణకు ఆటోడ్రైవర్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.

డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదు. మద్యం లేదా మత్తు పదార్థాలు వాడి వాహనం నడపరాదు, అలాగే యూనిఫామ్ తప్పనిసరి అని పోలీస్ తనిఖీల సమయంలో సహకరించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాక, సందేహాస్పద వ్యక్తులు లేదా నేర సంబంధిత సమాచారం ఉంటే వెంటనే 100 నంబర్‌ కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమం ద్వారా రహదారి ప్రమాదాలు తగ్గే దిశగా పోలీస్-ఆటోడ్రైవర్ల మధ్య సమన్వయం మెరుగుపడేందుకు ఉద్దేశించబడుతున్నదని, ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. పెద్ద కొడప్గల్ పోలీసు శాఖ తరఫున ఆటోడ్రైవర్లను ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించి, సురక్షితమైన, శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.