calender_icon.png 16 September, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్ వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

15-09-2025 10:52:58 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి 

సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు

హుజూర్ నగర్: అంగన్వాడీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, శ్రామిక మహిళ కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అంగన్వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కారం కొరకు సోమవారం పట్టణంలోని మంత్రి ఉత్తమ్ ఇంటి ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు...కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఐసిడిఎస్ తోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్య విధాన చట్టాన్ని తెచ్చిందని అన్నారు.

గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు అనేక హామీలు ఇచ్చారని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కనీస వేతనం 18 వేల రూపాయలు చెల్లిస్తానని ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తానని చెప్పి నేటికీ హామీలు అమలు చేయలేదని వారన్నారు. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసి సీనియారిటీకి ఇంక్రిమెంట్స్ నిర్ణయించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్ప ప్రకారం అంగన్వాడి ఉద్యోగులకు గ్రాడ్యుటి చెల్లించి రిటైర్డ్ అయిన అంగన్వాడీ ఉద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు అన్నారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని తక్షణమే బిఎల్ఓ డ్యూటీనీ రద్దు చేసి అదనపు పనివారాన్ని తగ్గించాలన్నారు.