calender_icon.png 17 May, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమలాకర్ ను పరామర్శించిన ఎంపీ బలరాం నాయక్

16-05-2025 06:29:12 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): పితృవియోగానికి గురైన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ ను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పరామర్శించారు. దివంగత బుచ్చయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమలాకర్ తో పాటు ఆయన సోదరులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట కేసముద్రం మార్కెటింగ్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఏదల్ల యాదవ రెడ్డి, దసురు నాయక్, హెచ్. వెంకటేశ్వర్లు, డివైసిసి అధ్యక్షుడు సురేష్ నాయక్, పోతురాజు, ప్రభాకర్ గౌడ్, కూరెల్లి సతీష్, రాము గౌడ్ తదితరులున్నారు.