16-05-2025 06:41:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి సంస్కృత ప్రాష ప్రచార సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బీ.వెంకట్ సాహిత్య సన్మానాన్ని అందుకున్నారు. సాహిత్య రంగంలో చేస్తున్న కృషిగాను ఆయనకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి సమావేశ మందిరములో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ సన్మానం చేశారు.
ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన పహల్గాం, హాస్యం వల్లరి, గద్వాల సోమన్న రచన సప్తతి పుస్తకాల ఆవిష్కరణ సభలో పాల్గొనగా అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు, తెలుగు విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్ డా.కాంచనపల్లి గోవర్ధన్ రాజు, విశ్వంభర పత్రిక సంపాదకులు డా.కాచం సత్య నారాయణ, చౌడూరి కళాపీఠం వ్యవస్థాపకులు చౌడూరి నరసింహ్మ రావు, తదితర ప్రముఖులచేతుల మీదుగా ఈ సన్మానమును అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 136 కవులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు.