calender_icon.png 17 May, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి పుష్కరాలో ఆయుష్ ఆయుర్వేద సేవలు

16-05-2025 06:36:19 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఆయుష్  ఆదేశాల మేరకు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యునాని, హోమియోపతి, ఆయుర్వేదిక్  డిపార్ట్మెంట్ల నుండి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆర్డీడీ డాక్టర్ ప్రమీల దేవి తెలిపారు. సరస్వతీ పుష్కరా లకు వచ్చే భక్తులు ఈ శిబిరాలను ఉపయోగించు కోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమాన్ని సరస్వతి పుష్కరాలకు  వచ్చే భక్తులు సద్వినియోగం చేసుకోగలరని అన్నారు.

ఈ కార్యక్రమం డాక్టర్ లీ చంద్ర  జయశంకర్ భూపాలపల్లి తనుజారాణి డాక్టర్ భాను కుమార్  హనుమకొండ, డాక్టర్ షగుఫ్త యునాని, డాక్టర్ జ్యోత్స్న హోమియోపతి, డాక్టర్ సారంగపాణి  ఆయుర్వేదం,  ఫార్మసిస్ట్లు శైలజ, సునీత, రీటా సునీత,  యోగా ఇన్స్పెక్టర్లు రాము, శ్రీధర్, సుమన్, ఫరీదా పాల్గొన్నారు.