18 April, 2026 | 9:57 PM

Breaking News

మోడల్ స్కూళ్లలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

20-06-2025 12:10 AM

టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): మరణించిన 40 మంది మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల కుటుంబ స భ్యులకు కారుణ్య నియామకాలు కల్పిం చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీ కొండయ్య కోరారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను గురువారం కలిసి మోడల్ స్కూళ్లలోని సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో జీవో నెం.23 ప్రకారం అమలు చేస్తున్న విధంగా తెలంగాణ మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యలో కలిపి, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరినట్లు వారు తెలిపారు.