18 April, 2026 | 11:35 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

భూ సమస్యలులేని మండలంగా తీర్చిదిద్దాలి

20-06-2025 12:13 AM

హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి

చిగురుమామిడి, జూన్ 19(విజయక్రాంతి): :రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతిలో భూ సమస్యలు లేని మండలంగా చిగురుమామి డి మండలాన్ని తీర్చిదిద్దాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి రెవిన్యూ అధికారులకు సూచించారు. గురువారం చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో తహసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు.

ఈ సదస్సుకు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చాలా ఏళ్లుగా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారని,భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం 2025ను తీసుకువచ్చిందని భూ సమస్యలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు.

రైతులకు ఎలాంటి భూ సమస్యలు ఉన్న రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, రెవెన్యూ సదస్సుల అనంతరం మీ సేవల ద్వారా దరఖాస్తు చే సుకోవచ్చని తహసిల్దార్ సూచించారు. భూభారతి రెవెన్యూ సదస్సులు అనంతరం రైతులు ఇచ్చిన దరఖాస్తులను రెవెన్యూ బృందం సహకారంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిష్కరిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూతుబుద్దీన్,ఆర్‌ఐలు అరుణ్ కుమార్,తారా దేవి,మాజీ ఎంపిటిసి చీల లక్ష్మారెడ్డి,రైతులు పచ్చిమట్ల జగన్ గౌడ్,వంటకాల సంపత్ రెడ్డి,పచ్చిమట్ల లక్ష్మి,ముంజ ప్రకాష్ గౌడ్,బోయిని శ్రీనివాస్,మహమ్మద్ షాబుద్దీన్, పూ ల లచ్చిరెడ్డి, దొబ్బల బిక్షపతి,కాత తిరుపతి, పచ్చిమట్ల అజయ్ గౌడ్, పూదరి ఎల్ల గౌడ్, మహమ్మద్ రసూల్, కవ్వంపల్లి సంజీవ్, జిల్లెల రమేష్, నారాయణరెడ్డి,ఎండ్రా అనిల్, జేరిపోతుల వెంకట్ స్వామి,తదితరులుపాల్గొన్నారు.